1 సముయేలు 15:22.... అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. సౌల్ ను దేవుడు ఇజ్రాయెల్ దేశం పై రాజుగా నియమించాడు. సముయేలు అతని రాజు గా ప్రకటించాడు. అప్పటికి సౌల్ లో మంచి తగ్గింపు ఉంది. మంచి ఆత్మీయ అనుభవాలు తెలుసు మంచి వ్యక్తీ సౌల్ ఒక్కపుడు జీవించిన జీవితం వేరు ఇప్పుడు జీవించే జీవితం వేరు ముందు పనికిమలిన వాళ్లతో తిరిగేవాడు త్రాగుబోతులతో తిరిగేవాడు. కాని ఇప్పుడు నూతన మనస్సు పొంది ప్రవక్తలతో తిరుగుతున్నాడు ఆత్మీయ సహావాసం చేస్తున్నాడు... ఒక సారి సముయేలు సౌల్ తో 7 రోజులు గిల్గాలు వేచి యుండుము ప్రజలందరి ముందు దహన బలి అర్పించుటకు అని చెప్పాడు సౌల్ అయన చెప్పిన విదంగా 7 రోజులు ఎదురు చూసాడు ఏడు రోజులు ఎదురుచుసిన సౌల్ ఏడు నిముషాలు ఆగలేకపోయాడు. సముయేలు రాకుండానే దహన బలి అర్పించాడు. వెంటనే సముయేలు వచ్చ...