బైబిలు గ్రంధము చదివే విధానము ఎలా?

1. వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరు చెప్పారు?

2. వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరితో చెప్పబడిన సంగతులు?

3. వ్రాయ వ్రాయబడిన వచనములోని సంగతులు ఏ కాలములో చెప్పబడినది?

4. వ్రాయబడిన వచనములోని సంగతులు ఏ సందర్బములో చెప్పబడినది?

5. వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరు అనుసరించడానికి చెప్పబడినది?

6. వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనములా?

7. వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే, ఆ ప్రవచనము ఎవరినిగూర్చి వ్రాయబడిననవి?

8. వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే, ఆ ప్రవచనము నెరవేరినదా? నెరవేరలేదా?

9. వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే, ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేరినది? ఎవరిలో నెరవేరినది?

10. వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే, ఆ ప్రవచనము నెరవేరకపోతే, ఎప్పుడు నెరవేరును? ఎవరిలో నెరవేరును?

11. వ్రాయబడిన వచనములోని సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవా?

12. వ్రాయబడిన వచనములోని సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవా?

13. వ్రాయబడిన వచనములోని సంగతులు రూపకాలంకారముగా చెప్పబడియున్నవా?

14. వ్రాయబడిన వచనములోని సంగతులు ఉపమాన రీతిగా చెప్పబడియున్నవా?

15. వ్రాయబడిన వచనములోని సంగతులు ఉన్నవి ఉన్నగా వ్రాయబడినవా?

16. వ్రాయబడిన వచనములోని సంగతులు పర్యాయ పదములుగా వ్రాయబడిన వచనమా?

17. వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరైనా ఒక వ్యక్తి కలిగియున్న గుణక్షణములు, బలములు, అధికారము, జ్ఞానమును, తెలియపరచడానికి సిOబాలిక్ భాషలో లేక సంకేత భాషలో వ్రాయబడినవా?

18. వ్రాయబడిన వచనములోని సంగతులు కొన్ని ప్రదేశములు, పట్టణములు స్తలములు కలిగియున్న స్థితిని తెలియపరచ డానికి సిOబాలిక్ భాషలో లేక సంకేత భాషలో వ్రాయబడినవా? అనే సంగతులను ముందుగా పరిశీలించాలి.

United Bible Academy

Email: ubacademyhyd@gmail.com

Cell: 9441206661, 9154542290

Comments

Post a Comment

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.