దేవుడు నిజంగా ఉన్నాడా? (మొదటి భాగమ)
ఈ ప్రశ్నకు బైబిల్ ఇచ్చే జవాబు
దేవుడు ఉన్నాడు.
దేవుడు ఉన్నాడని చెప్పడానికి బైబిల్లో తిరుగులేని రుజువులు ఉన్నాయి.
మతాలు చెప్పేవాటిని గుడ్డిగా నమ్మమని బైబిలు చెప్పట్లేదు గానీ మంచిచెడులను వివేచించగల సామర్థ్యాన్ని ఉపయోగించి దేవునిపై విశ్వాసం పెంచుకోమని చెప్తుంది. (రోమీయులు 12:1; 1 యోహాను 5:20)
❇ సైన్సు చెప్పిన విషయాలను ముందే చెప్పిన బైబిల్...
1.భూమి శూన్యంలో వ్రేలాడుతుందని ముందే చెప్పిన బైబిల్
భూమి శూన్యంలో వ్రేలాడుతుందని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త క్రీ.శ. 1475 లో కనుగొన్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో విజ్ఞాన విషయములు కనుగొన్న “సర్ ఐజక్ న్యూటన్” కూడా 17వ శతాబ్దములో భూమి శూన్యంలో వ్రేలాడుతుందని నిరూపించి తెలియజేసాడు. అప్పటి నుంచి విద్యార్ధులకు భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పడం ప్రారంభించారు.
❇ అయితే ఇదే విషయాన్ని
“పరిశుద్ధ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే “యోబు” గ్రంధములో తెలియజేసింది.
శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.(యోబు 26:7)
2.భూమి గుండ్రముగా ఉంది అని చెప్పిన బైబిల్
భూమి గుండ్రముగా ఉందని క్రీ. పూ. 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికి, కాదు బల్లపరుపుగా ఉందని మరి మరికొందరు శాస్త్రవేత్తలు క్రీ.శ. 16వ శతాబ్దము వరకు వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాదనలు ఉన్న సమయములో “గెలీలియో” అనే శాస్త్రవేత్త క్రీ.శ. 16వ శతాబ్దములో పలు ప్రయాసల చేత భూమి గుండ్రముగా ఉందని నిరూపించాడు.
❇ ఇదే విషయాన్ని “దైవ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే “యోబు” గ్రంధములో తెలియజేసింది.
ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును (యోబు 37:12).
ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు. (యెషయా 40:22)
He that sitteth upon the circle of the earth (Isaiah 40:22)
3.ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పిన బైబిల్
విలియం హార్వే క్రీ.శ. 1628 లో ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పాడు.
❇ క్రీ.పూ. 14వ శతాబ్ధములోనే ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంధములో వ్రాయించాడు. (ఆదికాండము 9:4,5; లేవికాండము 17:11)
*రక్తము దేహమునకు ప్రాణము* (లేవీకాండము 17:11)
4.నక్షత్రాలను లెక్కించడం వీలు కాదని చెప్పన బైబిల్
టెలీస్కోప్ ను కనిపెట్టకముందు మరియు కనిపెట్టిన (క్రీ.శ. 1600) తరువాత చాలా మంది నక్షత్రాలను లెక్కపెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు క్రీ.శ. 20వ శతాబ్దములో నక్షత్రాలను లెక్కించలేమని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేసారు.
❇ నక్షత్రాలను లెక్కించడం వీలు కాదని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (ఆదికాండము 15:5, యిర్మియా 33:22)
ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును. (యిర్మియా 33:22)
5. 21వ శతాబ్దములో శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక నక్షత్రమునకు, మరొక నక్షత్రమునకు బేధము కలదని, ఒకొక్క నక్షత్రము వేరు వేరు ఉష్ణం, కాంతి గలవని చెప్పకముందే బైబిలులో పరిశుద్దాత్మ దేవుడు ఈ విషయములను వ్రాయించాడు.
నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు (1 కొరింథీ 15:41)
6.గాలికి బరువు ఉన్నాదని ముందే చెప్పిన బైబిల్
క్రీ.శ. 1783 లో జోసెఫ్ మౌంట్ మరియు జాక్వస్ “బలూన్ (Balloon)”ని కనుగొన్న తరువాత గాలికి బరువు ఉన్నాదని ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు.
❇ వీరు ఈ విషయాలను కనిపెట్టక పూర్వమే పరిశుద్ధ గ్రంధం బైబిలు క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే తెలియజేసింది.
గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు (యోబు 28:25)
7.సముద్ర జలములు సూర్యవేడిమి చేత ఆవిరిగా మారి, మేఘములుగా మారి వర్షం కురిసి నదులు, సముద్రాలు నిండుతున్నాయి అని ఇది ఒక జల చక్రం అని క్రీ.శ. 17వ శతాబ్దములో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
❇ ఈ విషయాన్ని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (కీర్తనలు 135:7; ప్రసంగి 1:7; యిర్మియా 10:13; యోబు 36:28).
నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును (ప్రసంగి 1:7).
భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.(కీర్తనలు 135:7)
అంటే బైబిల్ సత్యంకాదా?
సత్య దేవుడైన యేసు ఉన్నట్లు ఇది రుజువు కాదా?
*ఇలాంటి విషయాలు ఎన్నో బైబిలులో కలవు.
*ఇవి కేవలం కొన్ని మాత్రమే.
*నేటి మానవులు
▪అనేక పరికరాల ద్వారా,
▪ పరిశోధనల ద్వారా,
▪ టెక్నాలజీ ద్వారా “విశ్వ సంబందిత” విషయాలను కనుగొంటున్నారు.
❇ అయితే బైబిలు వ్రాసిన వ్యక్తులు ఎలాంటి టెక్నాలజీ లేని సమయములోనే, ఎలాంటి పరిశోధనలు లేకుండానే విశ్వ సంబందిత విషయాలను మరియు భవిష్యత్తు ప్రవచనాలను తెలియజేసారు. ఇదెలా సాధ్యం?
ఎందుకంటే వ్రాసింది వ్యక్తులే అయినా, వారి చేత వ్రాయించింది మాత్రం దేవుడే. అందుకే బైబిలును దైవ గ్రంధం అని, ఇలాంటి విషయాలను దేవుడు మాత్రమే ముందుగానే వ్రాయించగలడని కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు తమ నోటితో ఒప్పుకొంటూనే ఉన్నారు.
బైబిల్ని రాసివాళ్లకు, శాస్త్రవేత్తలకన్నా మిగతావాళ్లకన్నా చాలా ఎక్కువ విషయాలు తెలుసు. కారణం దేవుడే ఇవన్నీ బైబిల్ ద్వార తెలియ పర్చాడు.
ఈ కాలంలోని ప్రజలకు తెలియని విషయాలు వేల సంవత్సరాల క్రిందటే బైబిలు రాసినవాళ్లకు తెలిసాయంటే వాటిని దేవుడే వాళ్లకు చెప్పి ఉంటాడనేది ఖచ్చితం.
ఇదే సృష్టికర్తయైన యేసు ఉన్నాడనే దానికి తిరగులేని రుజువు.
సమస్త మహిమ దేవునికే కలుగును గాక,
హల్లెలూయ...
మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!
Comments
Post a Comment