చల్లబడిపోయావా.? లేక మండుచున్నావా.?

       ఒక చర్చి తాలూకు సభ్యుడు క్రమం తప్పకుండా చర్చిలో జరిగే సమావేశాలకు హాజరయ్యేవాడు. కానీ అతను హఠాత్తుగా చర్చికి వెళ్ళటం మానేశాడు. కొన్ని వారాలు గడిచాక పాస్టర్ అతని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆరోజు సాయంత్రం బాగా చలి వేస్తోంది. పాస్టర్ వెళ్లేసరికి అతను ఒక్కడే చలికాచుకుంటూ ఉన్నాడు. పాస్టర్ ని చూడగానే లోపలికి ఆహ్వానించి మంట దగ్గర కుర్చీ వేసి ఆయన ఏం మాట్లాడతాడో అని వేచి చూడసాగాడు. పాస్టర్ గారు కూర్చుని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కొద్ది నిమిషాలు గడిచాక పాస్టర్ గారు పట్టుకారు తీసుకుని ఎర్రగా మండే ఒక నిప్పు కణికను తీసి పక్కన విడిగా పెట్టాడు. మళ్లీ కుర్చీలో వెనక్కి ఆనుకొని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆ విశ్వాసి అబ్బురపడుతూ చూస్తూ కూర్చున్నాడు. విడిగా తీసిపెట్టిన నిప్పు కణిక నెమ్మదిగా మండటం మానేసింది, కొద్దిసేపట్లో చల్లబడి పూర్తిగా ఆరిపోయింది. ఇంట్లోకి రాగానే ఒకరినొకరు పలకరించుకున్నారు అంతే, ఆ తరువాత ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాస్టర్ గారు వెళ్లడానికి లేస్తూ ఆరిపోయిన ఆ బొగ్గు ముక్కను తీసి మళ్లీ మండుతున్న మంటల్లో పడేశారు. వెంటనే అది మళ్ళీ మండటం మొదలైంది. చుట్టూ ఉన్న నిప్పుకణికల నుండి దానికి సెగ తగిలింది. పాస్టర్ గారు ఇక వెళ్తుండగా ఆ విశ్వాసి మీరు మా ఇంటికి వచ్చినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, ముఖ్యంగా మీరిచ్చిన నిప్పులాంటి ఉపదేశానికి.... నేను వచ్చే ఆదివారం మళ్లీ చర్చికి వస్తాను అన్నాడు.

జ్ఞానులతో కలిసి నడిచేవాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, కానీ మూర్ఖుల సాంగత్యం కోరేవాడు హానికి గురవుతాడు. ~సామెతలు 13:20

దత్తత తీసుకున్న పిల్లవాడు కాలక్రమేణ దత్తత తీసుకున్న కుటుంబం తాలూకు లక్షణాలనే అలవరచుకుంటాడు అంటారు కదా.. నిజమే..... మనం ఎటువంటి వారితో కలసి తిరుగుతామో, వారిలాగే తయారవుతాయి. మనం ఎదిగే సామర్థ్యం ఉండి కూడా ఎదగవలసినంత వేగంగా ఎదగకపోయినా, అందంగా, గౌరవంగా జీవించే సామర్థ్యం ఉండి కూడా అలా జీవించకపోయినా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి......మనం పని చేస్తున్న సంస్థ అయినా, మనం కలిసిమెలిసి ఉండే స్నేహితులైనా, మనం ఎదుగుతున్న కుటుంబమైనా అది మనల్ని సరైన మార్గంలో నడిపించనట్టయితే, మనం ఎదిగే వీలున్న మరోచోటికి మారిపోవాలి. అది చాలా కష్టమైన నిర్ణయమే, కానీ ముఖ్యమైనది కూడా. ఒక విత్తనాన్ని చెత్తకుప్పలో పారేసి వృథా చేయడం వల్ల ప్రయోజనమేమిటి.?

Comments

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.