బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము


1 సముయేలు 15:22....
అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.

సౌల్ ను దేవుడు ఇజ్రాయెల్ దేశం పై రాజుగా నియమించాడు. సముయేలు అతని రాజు గా ప్రకటించాడు. అప్పటికి సౌల్ లో మంచి తగ్గింపు ఉంది. మంచి ఆత్మీయ అనుభవాలు తెలుసు మంచి వ్యక్తీ సౌల్ ఒక్కపుడు జీవించిన జీవితం వేరు ఇప్పుడు జీవించే జీవితం వేరు

        ముందు పనికిమలిన వాళ్లతో తిరిగేవాడు త్రాగుబోతులతో తిరిగేవాడు. కాని ఇప్పుడు నూతన మనస్సు పొంది ప్రవక్తలతో తిరుగుతున్నాడు ఆత్మీయ సహావాసం చేస్తున్నాడు...

         ఒక సారి సముయేలు సౌల్ తో 7 రోజులు గిల్గాలు వేచి యుండుము ప్రజలందరి ముందు దహన బలి అర్పించుటకు అని చెప్పాడు సౌల్ అయన చెప్పిన విదంగా 7 రోజులు ఎదురు చూసాడు ఏడు రోజులు ఎదురుచుసిన సౌల్ ఏడు నిముషాలు ఆగలేకపోయాడు. సముయేలు   రాకుండానే దహన బలి అర్పించాడు. వెంటనే సముయేలు వచ్చాడు

      సముయేలు సౌలా... సౌలా.. ఎంత పని చేసావు ఏడు రోజులు ఆగిన నివు ఏడు నిమిషాలు ఆగలేకపోయావు ఎందుకు....అని అడిగాడు.
         సౌల్ ......... ఏం మాట్లాడుతున్నావు ఏడు రోజులు ఎదురు చూసా నీకోసం నువ్వు రాలేదు అందుకే నా అంతట నేనే సాహసించి నేనే దహన బలి అర్పించాను......

         సౌల్ మొదట్లో సముయేలు ఏదీ చెప్తే అదే చేసేవాడు అయన చెప్పినప్పుడు ప్రతిది చెప్పినట్లు చేసాడు కాని సముయేలుకు ఎదురు మాట్లాడుతున్నాడు
   
             ఏమైంది సౌల్ కు మొదట ఉన్న తగ్గింపు ఇప్పుడు అవగింజంత కూడా కనిపించడం లేదు. 
         సముయేలు సౌల్ తో అన్నాడు శాశ్వతకాలం నిన్ను ని సంతానాన్నికి ఈ సింహాసనం ఈ రాజ్యని ఇవ్వాలి అనుకున్నాడు ఇక నుండి అది జరగదు అని చెప్పాడు.

      సౌల్ అనుకున్నాడు ప్రవక్త సముయేలునే చేస్తాడు ఈ ఒకటి నేను చేస్తే ఏం ఆవుది అనుకున్నాడు దేవుడు అతని సింహాసనము నుండి తొలగించాడు.
      సౌల్ మాట్లాడే విధానం చుస్తే ఏదో తెలియని గర్వము ఆహాకారం మాత్రమే కనిపించాయి కాని మొదట కనిపించిన తగ్గింపు ఇప్పుడు కనిపించడం లేదు
       
     సౌల్ చేసిన చిన్న పొరపాటు సింహాసనము నుండి తొలగించాడు దేవుడు
    
చిన్న పొరపాటు కొండంత పెద్ద సమస్యకు దారి తీసింది
   
    సౌల్ ఆ అభిషేకం ఆ పిలుపు అని కోల్పోయాడు..

     సహోదరి సహోదరుడా......
గాడిదలు వెతుకునే సౌల్ కు గొప్ప సింహాసనం ఇస్తే ఆ భాగ్యాన్ని కోల్పోయాడు
    
ఈ రోజు చాలామందికి దేవుడు మంచి ఉన్నత స్థాయిలో పెట్టాలని మంచి పేరు ఖ్యాతి ఇవ్వాలని అయన కోరుకుంటే అది పొందుకోకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తున్నారు

     చాలామంది చిన్న సమస్య కదా అని ఏం కాదులే అనుకుంటారు ఎవరు చూడటం లేదు అని వదిలేస్తారు కాని దేవుడు చూస్తాడు అనె సంగతి అనుకుంటారు కానీ తప్పకుండ దేవుడు చూస్తాడు

2 రాజులు 5...

     సిరియా దేశంలో నయమాన్ అనే సైన్యదిపతికి భయంకరమైన వ్యాధితో బాదపడుతున్నాడు ఆ వ్యాధి తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన లాభం లేకపోవడంతో  ఆఖరికి నిరాశ మిగిలింది.

            ఒక సారీ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ప్రవక్త ఏలిషా చెప్పినట్లు నయమాన్ యొర్దన్ నదిలో మునిగిన వెంటనే అతడు స్వస్థత పొందాడు.
అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహు మానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా
ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.
         ఎలీషా దగ్గర గేహజి ఉన్నాడు గెహజి మంచి నమ్మకమైన వ్యక్తీ ఎలీషా కూడా తను ఎటు వెళ్లినా గెహజి వెంటబెట్టుకొని వెళ్ళేవాడు.
        గెహజి నయమను దగ్గర ఉన్నా సంపద చూసి ఇంత ఐశ్వర్యాన్ని ఎందుకు వదులుకోవాలి ఎలాగైనా అవి అని నేను పొందుకోవాలి అనుకున్నాడు
   
        నయమను కాస్త దూరం వెళ్ళగానే దైవసేవకునికి తెలియకుండా గెహజి వెళ్ళి నా యజమానుడు నాచేత వర్తమానము పంపిప్రవక్తల శిష్యులలో ఇద్దరు ¸°వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయ చేయుమని సెలవిచ్చుచున్నాడనెను.
         మళ్ళి ఏం తెలియనట్లు ఏలిషా ముందుకు వచ్చాడు.
ఏలిషా గెహజి ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నేను ఇక్కడే ఉన్నాను బోధకుడా అని అబ్బదం చెప్పడం మొదలుపెట్టాడు

       సౌల్ చేసిన పొరపాటు సింహాసనం నుండి తొలగించింది.గెహజి ఆశ పడ్డాడు అతని తరువాత తరాలకు కూడా ఆ కుష్టువ్యాధి వచ్చింది
   
         సహోదరి సహోదరుడా......
గాడిదలు వెతుక్కునే సౌల్ ను దేవుడు రాజుగా అభిషేకిస్తే అంత గొప్ప భాగ్యాన్ని సౌల్ ఓక చిన్న తొందరపాటులో కోల్పోయాడు
యెహోవా సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యాన్ని గెహజికి ఇస్తే లోకసంబంధమైన సంపద కోసం అంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు

హేబ్రీ 12:2.....

       మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.


Comments

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.