"క్రీస్తు" వారు తన "శిష్యుల పాదములు" కడుగుటకు గల కారణమేమిటో ?


క్రొత్త నిబంధనలో మీరు చూసినట్లయితే క్రీస్తువారి పాదములు కు సాగిలపడినవారు ,ఆయన పాదముల యెద్ద కూర్చుని వాక్యము వినినవారు .ఆయన పాదములను కన్నీటితో కడిగినవారు ,ఆయన పాదములకు నమస్కారము చేసినవారు అనేకమంది యున్నారు

ఎందుకు అంటే ఆయన సర్వశక్తి గలిగిన ,మహా దేవుడు కాబట్టి

"క్రీస్తు" వారు కూడా తన శిష్యుల పాదములు కడిగిన సందర్భము మీరు చూడగలరు గొప్పవాడైన ఆయన అల్పులైన,ఎన్నికలేని వారీగా శిష్యులుగా ఎన్నుకొని వారి పాదాలు  ఆయన ఎందుకు కడిగారు? తుడిచారు? ఆలోచించండి 

అక్కడ మీరు గమనించవలసినది "తగ్గింపు " కలిగియుండుట అనేది మనకు నేర్పి మాదిరి చూపించారు

ఆయన వలె ప్రేమ తగ్గింపు, కరుణ ,దయ, జాలి, వివేకం, వినయం, ఓర్పు క్షమించేగుణం అన్ని మనము నేర్చుకోవాలని అని

1.అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను
(యోహాను సువార్త 13:8)

ఈ వాక్యము మీరు అర్ధం చేసుకోండి ఆయన ఎంత తగ్గించుకొని ప్రవర్తించారో అదే మాదిరి కరముగా క్రీస్తుని పోలి మనము కూడా తగ్గింపు ప్రవర్తన కలిగియుండాలని గ్రహిచండి

2.కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.
(యోహాను సువార్త 13:14)

ఈ వాక్యమును బట్టి మీరు అర్ధం చేసుకోండి ఒకరి యెడల ఒకరు తగ్గింపుకలిగి క్రీస్తును పోలి జీవించాలి అని గ్రహించండి

ఏ వాక్యాలలో అయినా అనేక గూడార్ధాలు దాగి ఉంటాయి ఎవరికీ ఎలా అర్ధమయ్యేవిధముగా మాట్లాడాలో దేవుడు అలానే మాట్లాడతాడు కాబట్టి వాక్యం చదవండి"క్రీస్తును" పోలి ప్రతివిషయములోనడుచుకోండి ఏమంటారు ?

Comments

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.