ఆ పాపం పోవాలంటే-పరిశుద్దుడే రావాలి........!
లుకా 2:11......
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
లోకంలో చాల వార్తలు వినటం మనం చూస్తాము ఎప్పుడు వినని గొప్ప శుభవార్త ఉంది.
ఆ వార్త రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఇది ఒక గొప్ప శుభవార్త
పుట్టింది ఒక లాయర్ కాదు,ఒక పోలిష్ కాదు, ఒక డాక్టర్ కాదు, రైతు కాదు, ఈ
లోకంలో మనం జీవించాలి అంటే కొంత వరకు వీళ్ళు కొంత అవసరమే ఈ లోకంలో మాత్రమే
మనిషి భూమి మిద శరీరంతో ఉన్నప్పుడు ఆ శరీరముతో చేసే ప్రతి పాపానికి అతని ఆత్మ నిత్య నరకంలోకి వెళ్తుంది.మరి పాపం చేసిన వ్యక్తీ నరకపాత్రుడు అవుతున్నాడు. వారిని రక్షించుటకే ఆ యేసు క్రీస్తు వచ్చాడు.
ఆ పాపం చాల ప్రమాదకరమైనది.....
రోమా 5:12......
ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
ఆదాము ద్వార పాపం ఈ లోకంలో ప్రవేశించింది. మనుష్యులు అందరు పాపనికి బానిసలుగా మారారు. పూర్తిగా ఆ పాపం వారికి మరణాన్ని తెచ్చిపెట్టింది.
యకోబు 1:15....
దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
పై వాక్యాన్ని గమనిస్తే పాపం వలన ప్రతి మనిషి మరణాన్ని పాత్రుడుగా మారాడు.
మానవుడు పాపం చేయుట వలన నిత్య జీవాన్ని కోల్పోయాడు. నిత్య జీవము పొందాలి అంటే పాపం నుండి విముక్తి పొందాలి.
పాపం పోవుటకు చేసే ప్రయత్నం
చాలమంది అంటారు వారి పాపం పోవాలి నదులలో సముద్రలలో మునిగిన వారి వలన నదులు సముద్రాలు కాలుష్యం అవుతున్నాయి కాని వారి పాపం విడుదల పొందడం లేదు. ఇంకా ఎన్నో యాత్రలు యాగాలు దనధర్మాలు చేస్తున్నారు కాని ఆ పాపము నుండి విడుదల పొందలేకపోతున్నారు. అది సాద్యం కావడం లేదు
పూర్వకాలంలో పెద్దలు పాపం పోవడానికి రకరకాల బలులు అర్పించారు. నరబలి చేసేవాళ్లు జంతువులను బలి ఇచ్చేవారు. అది సాద్యం కాలేదు
హేబ్రీ 10:3.........
ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
నిజమే ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
ఎందుకంటే మనిషి జ్ఞానం కలవాడు బుద్దిగలవాడు జంతువులకు జ్ఞానం ఉండదు
బుద్ది ఉండదు. *బుద్ది గలవాని పాపం ఒక బుద్ది లేని జంతువు రక్తము ఎలా అతని పాపని తీసివేస్తుంది.* అది అసాధ్యము
ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. నిజమే
హేబ్రీ 9:22......
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, *రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదు.*
ధర్మ శాస్త్రము నువ్వు ఎంతటి పాపివొ చెప్పగలదు కాని ఆ పాపం తీసివేయలేదు.
ఉదా.. ధర్మమీటరు నీకు ఎంత జ్వరం వచ్చిందో చెప్పగలదు కాని జ్వరాన్ని తీసివేయలేదు ధర్మ శాస్త్రము కూడా అంతే*
రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదు. కాని ఆ రక్తము పరిశుద్ధమైనది ఉండాలి. పాపం లేని రక్తము అయి ఉండాలి. అది పరమాత్ముడు అయి ఉండాలి.
మానవుడు పాపం పడి జీవిస్తున్నప్పుడు సమాదానం లేదు సంతోషం లేదు.చీకటి సంబంధమైన శక్తుల చేత కట్టబడియున్నాడు సాతాను యొక్క హస్తాలతో బందించబడ్డాడు.
పాపం నుండి విడిపించుట ఎవరి వలన కాలేదు అందుకు దేవుడే 2017 క్రితం కన్య గర్భమున పుట్టి ఈ లోకానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. అయన పాపంల నుండి విడుదల ఇవడానికి వచ్చాడు.
మతయి 1:21..........
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
పాపముల నుండి ఆయనే విడిపించును ఆయనే అంటే అయన తప్ప ఇంకా ఎవరు లేరు అని అర్థము
అయన 3% సంవత్సరాలు పరిచర్య చేసాడు. ఎంతో మందిని భయంకరమైన పాపము నుండి శాపం నుండి కుదరని రోగాలు కూడా బాగుచేసాడు. *అయన జీవితకాలమంతా ఆశ్చర్య క్రియలు చేస్తూ ఈ లోకంలో సంచరించాడు.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
అయన ప్రతి ఒకరి పాప భారాన్ని మోసి అందరికి గొప్ప రక్షణ ఇచ్చాడు
యేషయ 9:6......
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు.
నాకు గొప్ప ఆశ్చర్యము...
యేసు క్రీస్తు ఒక దేవుడై ఉండి సింహాసనం విడిచి గొప్ప రాజ్యాన్ని సర్వఅధికారం కలిగిన దేవుడు ఒక సామాన్యుడిగా ఈ లోకానికి రావడం గొప్ప ఆశ్చర్యము
ఒక ప్రాంతములో ఏదైన సమస్య ఉంటే ఎవరో ఒక పై అధికారి వచ్చి ఆ సమస్య తొలగించేస్తాడు కాని ఆ సమస్య కోసం ప్రధానమంత్రి రాలేడు కదా
పాపం పోవుటకు ఎన్నో యాగాలు యజ్ఞాలు బలులు ఆర్పణలు నదులలో మునిగినారు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసారు కాని ఆ పాపం నుండి విడుదల పొందలేరు ఎవరి వల్ల కాలేదు యేసయ్య ద్వారానే అయింది.
సహోదరి సహోదరులరా........
మనిషి చేసిన పాపం ఎంత ఘోరమైనదో తెలుసా ఆ పాపం సృష్టికర్తను ఈ భూమి మీదికి వచ్చేలా చేసింది.
Comments
Post a Comment