యేసు క్రీస్తు రెండవ రాకడ ఎవరి చేతిలో ఉంది..?

యేసు క్రీస్తు రెండవ రాకడ ఎవరి చేతిలో ఉంది..?
===================
యేసు క్రీస్తు మెుదటి సారి వచ్చి ముప్పైమూడున్నర సం.లు బ్రతికి మనందరి పాపాల కోసం సిలువలో బలియాగమై తిరిగి 3వ దినాన లేచి పరలోకం వెళ్ళి దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు.యేసు తిరిగి 2వ సారి ఈ లోకానికి రానైయున్నాడు.ఆయన వచ్చినపుడు ఈ పంచభూతాలు,సమస్త స్రుష్టి అగ్నితో కాల్చబడి నాశనమవుతుంది,ఇంతముందే చనిపోయి పరదైసులో ఉన్న నీతిమంతులను,ఆయన వచ్చేటప్పటికి భూమ్మీదున్న నీతిమంతులను తనతో పరలోకానికి తీసుకెల్లుతాడు.ఆయన ఎప్పుడు వస్తాడో మాత్రం ఎవరికి తెలియదు,(1థెస్స4:15-18,2పేతురు3:10-12)యేసు-మీరనుకోని గడియలో వస్తాను నేను దొంగవలె వస్తాను అన్నాడు.అనగా దొంగ ఎప్పుడు వచ్చి దోచుకెలుతాడో తెలియదు కదా.కాని ఆయన రెండవ రాకడ జరగాలంటే ఒకటి జరగాలి అదేంటంటే
"మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటింపబడును అటు తర్వాత అంతం వచ్చును"(మత్తయి24:14) పై లేఖనం ప్రకారం ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త అందించబడాలి అప్పుడు యేసు రెండవ రాకడ జర్గుతుంది.అంటే మనం ఎంత తొందర ఈ ప్రపంచానికి సువార్త అందజేస్తే అంత తొందర యేసు క్రీస్తు వస్తాడు.ఆయన రెండవ రాకడ మన చేతులోనే ఉంది.

Comments

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.