*బైబిల్ అనగానేమి*? *దానిని ఎలా చదవాలి?*

*బైబిల్ అనగానేమి*? *దానిని ఎలా చదవాలి?*

అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ శుబములు తెలియజేస్తున్నాను.

కోటాను కోట్ల పుస్తకములు రాయబడి వెలువరించబడి చదవబడిన ఈ ప్రపంచములో....వాటితోబాటే విప్లవాత్మకమైన రీతిలో ఈ ప్రపంచ గతినీ చరిత్రను మార్చివేసిన ఒక పుస్తకము ఆవిష్కరించబడింది. అదే *ద బైబిల్*.

1) *బైబిల్ అనగా ఏమిటి*?

బైబిల్ అనే పదం...*బిబ్లాస్* అనే గ్రీకు పదం నుండి వచ్చింది. గ్రీకులో బిబ్లాస్ అనగా *పుస్తకము లేదా గ్రందము* అని అర్దము. అందుకే తెలుగు బైబిల్ అట్ట మీద ఎంతో చక్కగా *పరిషుద్ద గ్రందము* అని ముద్రించబడింది. ముద్రణా యంత్రము జాన్ గూటెన్ బర్గ్ చేత కనుగొనక పూర్వము చర్మపు కాగితాల మీద సందేసము రాసి పంపేవారు. వాటన్నిటినీ కలిపి *చుడితే చుట్టవుతుంది కుడితే గ్రందమౌతుంది.* (లూకా 4:20) ఆయన *గ్రంథము చుట్టి* పరిచారకునికిచ్చి కూర్చి.
(హెబ్రి 10:7) అప్పుడు నేను *గ్రంథపుచుట్టలో* నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

బైబిల్ అనే పదం యొక్క అర్దము *గ్రందము* అని తెలియకపోతే..ఇస్లాం వారికి దొరికిపోతాము. ఇస్లాం వారు అడుగుతున్నారు ఒక ప్రముఖ బోదకుని.....బైబిల్ అనే పదం బైబిల్లో చూపించగలరా? అని..ఆ బోదకుడు తెల్ల ముఖము వేసుకొని చూసాడే తప్ప బైబిల్ లో ఉందని చెప్పలేక వేల మంది సమక్షంలో తల దించుకున్నాడు. కానీ మనం ఆ పదాన్ని చూపించి తల ఎత్తుకొని తిరుగుదాం.
ఇకపోతే....

2) *బైబిల్ని ఎలా చదవాలి?*

ఈ పరిషుద్ద గ్రందాన్ని అన్ని పుస్తకాలలాగా చదివినట్లైతే ప్రపంచ చరిత్ర అర్దం అవుతుంది. *దేవుని మనసేంటో దేవుడు మానవాళికి ఇచ్చే సందేశమేంటో* అర్దం కావాలంటే..*పరిశీలించి* చదువుకోవాలి (యెషయ 34:16) యెహోవా గ్రంథమును *పరిశీలించి* చదువుకొనుడి. భూమి మీద మనుషులు రాసిన గ్రందాలు పరిశీలించకపోయినా జరిగే పెద్ద ప్రమాదాలు ఏమీ ఉండవు. కానీ దేవుని గ్రందాన్ని పరిశీలించకపోతే *కనీ వినీ ఎరుగని* రీతిలో ప్రమాదం పొంచి ఉంది. మనుషులు రాసుకున్న పుస్తకాలు ఎవరికి నచ్చిన రీతిలో వారు చదువుకొని అర్దం చేసుకోవచ్చు. కానీ *యెహోవా గ్రందమును పరిశీలించి మాత్రమే* చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ​అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను *పరిశీలనగా* తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు (యిర్మి 9:24). మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి *పరిశీలించుచు* (1 పేతు 1:10). అంటే పరిశీలన అవసరం చాలా ఉందని అర్దమౌతుంది.

మరొక గమనించవలసిన విషయం ఏంటంటే..
వాక్యం చెప్పే వ్యక్తి యొక్క పలుకుబడి, ఆ వ్యక్తి యొక్క వాక్ చాతుర్యంకు కాదు గాని....
వినబడే వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి....ఆ వాక్యం బైబిల్ లో అలా ఉందో లేదో చూచి, సందర్భం కూడా అదేనా కాదో గమనించి వాక్యంను స్వీకరించి జీవితంలో పాటించాలి. వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును *లేఖనములు పరిశోధించుచు* వచ్చిరి (అపో 17:11). ఎందుకంటే మన ఆత్మలను రక్షించేది ఆ వాక్యమే గనుక ( యాకోబు 1: 21).

3) అనేకులు ఈనాడు వాక్యంలో తప్పులు పట్టుకొనుటకు బైబిల్ను చదువుతున్నారు. వారిలో వేదవ్యాస్ (బైబిల్ బండారం పుస్తక రచయిత) ఇస్లాం సోదరులు..హైందవ సోదరుడు కరుణాకర్ సుగ్గుణ. వీరందరూ తెలుసుకోవాల్సిన విషయమేమంటే..దేవుడు తప్పుకు దొరికిపోయేవాడు కాదు. మనిషి తప్పు చేస్తాడు గనుక దొరికిపోతాడు. *దేవుడు* అనే పదానికి అర్దం *మంచివాడు*. అంత మంచి దేవుని మరియూ అందరి దేవుని గురించి చెప్పినదే *ద బైబిల్*. దీనికి ఎంత ప్రాముఖ్యత చరిత్ర ఉందంటే..ముద్రణా యంత్రం కనుగొన్న వెంటనే ముద్రించబడిన తొలి పుస్తకమే *ద బైబిల్*

4) *బైబిల్ని దేవుడు ఎలా రాయించాడు?*

ముందుగా దేవుడు బైబిల్ని ఎలా రాయించాడో తెలిస్తే..ఎలా చదివితే అర్దమౌతుందో తెలుస్తుంది. (యెషయ 28:10) *ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట* చెప్పుచున్నాడని వారనుకొందురు.

అంతే కాకుండా మనిషి ఊహనుబట్టి లేఖనము పుట్టలేదు అని దేవుడు రాయించాడు.....(2 పేతు 1:20; 21) ఒకడు *తన ఊహనుబట్టి* చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.​

ఎ) సూన్యంలో బూమి వేలాడదీయబడి ఉంది...ఊహించి చెప్పలేదు.
బి) నక్షత్రాలు కదులుతున్నాయి (మార్గము తప్పి తిరుగు చుక్కలు)..ఊహించి చెప్పలేదు.

ఒక ప్రశ్నకు సమాదానం దొరకలేదని ఊహించి చెప్పకూడదు. నీకు తెలియనంత మాత్రాన అది లేదు కాదు అనకూడదు.
*ఉదా*:- ఈ లోకానికి తెలిసింది *సూర్యుడు ఉంటేనే మొక్కలు మొలుస్తాయని*. (ఆది 1:11) లో చూస్తే..3 వ దినమున దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను. సూర్యుని దేవుడు కలిగించినది 4 వ రోజు కదా!!.
(ఆది 1:14-19) అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
మరి సూర్యుడు లేకుండా 3 వ దినాన మొక్కలు ఎలా మొలిచాయి??

ఈ ప్రశ్నకి సమాదానం తెలియాలంటే దేవుని శక్తి ఎంతో తెలియాలి. మనిషివైన నీకు తెలిసింది శుర్య రశ్మి ఉంటేనే మొక్క మొలుస్తుందని. మరి ఇవన్నీ దేవునికి అవసరమా? అవసరం లేదు.
అలాగే...పిల్లలు కలగాలంటే స్త్రీ పురుషుల కలయిక అవసరం అని అందరికీ తెలుసు కానీ కన్యక గర్బం దాల్చేలా దేవుడు చేయాలంటే తనకి పురుష సహాయం అవసరం లేదు. నీ కెపాసిటి వేరు ఆయన కెపాసిటి వేరు. *దేవుడు నరుల శక్తికి మించినవాడు* (యేబు 33:13). నీకు అసాద్యం ఐనంత మాత్రాన దేవునికి అసాద్యం కాదు. నీకు కెపాసిటీ లేనంత మాత్రాన దేవునికీ లేదు అనుకోకూడదు. మొక్కని బ్రతికించాలంటే నీకు సుర్య రశ్మి అవసరం. కానీ దేవునికి అవసరం లేదు. పొయ్యి మీద నీళ్ళు మరిగించాలంటే ఏం చేయాలి? మంట పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? తెపాల కింద పెట్టాలి. నువ్వెప్పుడూ అంతే. నీకంతే తెలుసు. నీకు చేతనైనది అంతే. కానీ....
సముద్రాన్ని వేడెక్కించాలంటే దేవుడు మంట ఎక్కడ పెట్టాడు? ఆయన సముద్రం కింద పెట్ట లేదు. సముద్రం పైన పెట్టాడు.

(యెష 56:8). *నా తలంపులు మీ తలంపుల వంటివి కావు*. నీ తలంపు మంట కింద పెట్టటం..ఆయన తలంపు మంట పైన పెట్టటం. ఆయన ఎలాగైనా వేడెక్కించగలడు.

5) కనుక మనిషి ఊహించటం వలన బైబిల్లో ఏ లేఖనం పుట్టదని గ్రహించాలి.
......... ఒక రైతు మండు వేసవిలో పొలంలో పని చేసి తన ఇంటికి వచ్చి వసారాలో వేప చెట్టు క్రింద పడుకొని హాయిగా నిద్రపోయాడు. కొంతసేపటికి మేల్కొని చూస్తే తన మీద కొన్ని వేప కాయలు పడి ఉండటం గమనించాడు. ఆలోచిస్తూ..దేవుడు ఎంత వెర్రి వాడు ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలిచ్చాడు....చిన్న చెట్టైన పుచ్చ చెట్టుకేమో పెద్ద పెద్ద కాయలు ఇచ్చాడు అనుకుంటున్నాడు. నిజంగా..రైతు వెర్రి వాడా దేవుడు వెర్రి వాడా? రైతే వెర్రి వాడు. ఎందుకంటే....*ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు*. ఆయన తలంపేమో...నా బిడ్డలు మండు వేసవిలో చెట్ల క్రింద సేదతీరాలి కనుక చిన్ని చిన్ని కాయలు మీద పడ్డా ఏ హానీ జరగకూడదు అని. అందుకే పెద్ద చెట్టుకి చిన్ని కాయలు చిన్న చెట్టుకి పెద్ద పెద్ద కాయలిచ్చాడు. మన తలంపు వంటిది కాదు దేవుని తలంపులు.

6) అలాగే.. బైబిల్ లో సందర్బాలు ఊహించి చెప్పకూడదు. వ్యబిచారంలో పట్టబడిన సందర్బం (యోహాను 8:6) ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో *ఏమో* వ్రాయుచుండెను. ఈ సందర్బంలో..ఏమి రాస్తున్నాడో మనం ఊహించొచ్చా? ఆయన (యేసు) ఏమో..అంటే నువ్వు కూడా ఏమో అనాలి అంతే కానీ ఊహించి చెపితే ధిఖ్ఖారం కాదా?

కాబట్టీ....బైబిల్ని చదివేటప్పుడు కడు జాగ్రత్త వహించటం ఎంతైనా మంచిది. మానవ కల్పితమైన ఊహలతో బైబిల్ని *పటిస్తే బోదిస్తే* నిత్యాగ్ని దండనకు పాత్రులమౌతాము.

Comments

Post a Comment

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.