ఆశీర్వాధం అసలు అర్ధం....

* ఆశీర్వాధం అసలు అర్ధం....

చరిత్రలో దేవుడు అనేకమందిని ఆశీర్వదించారు....
అనేకమంది దేవుని ఆశీర్వధాలు పొందుకున్నారు.... ఇవ్వన్ని మనం రోజు ధ్యానించే విషయాలే.
నిజానికి ఆశీర్వదం అంటే ఏమిటి....?
నేను విదేశాలలో ఉద్యోగం చేయటం ఆశీర్వధమా...?
నేను ఆరు అంకెల జీతం తీసుకోవటం ఆశీర్వధమా...?
నేను ఖరీదైన కారుల్లో తిరగటం ఆశీర్వధమా...?
నేను మూడు పూటలా తినటం ఆశీర్వధమా...?
ఇవే ఆశీర్వధములు అయితే.... పౌలు గారికి కనీసం రోజుకి రెండు పుటలు కూడా భోజనం చేసే ఆశీర్వదాన్ని కూడా పొందుకోలేక పోయారు. ఇప్పుడు ఆయన్ని చూసి మనం జాలి పాడాలా...?
నాకు తెలిసి క్రొత్త నిబంధనలో పౌలు గారి వంటి భక్తుడు లేరు. అలాంటి పౌలు గారే ఈ ఆశీర్వధములలో ఒక్కధానిని కూడా పొందుకోలేదు.... గమనించాలి.
మరి నిజమైన ఆశీర్వదం ఏమిటి....?
“”అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండటమే నిజమైన ఆశీర్వదం””
దేవుడు ఇస్తే ఇలాంటి ఆశీర్వధాలు మాత్రమే ఎక్కువ ఇస్తారు.... బైబిల్ లో వ్యేక్తిగతమైన ఆశీర్వధాలు అత్యల్పం.

నా ప్రియ స్నేహితులారా.... గమనిచండి.
ఆదాముకి ఇవ్వబడిన ఆశీర్వదం సృష్టిని ఏలుటకు....(అది 1:28) ఆదాము దానిని పోగొట్టుకున్నాడు, అది వేరే విషయం.
నోవహుకి ఇవ్వబడిన ఆశీర్వదం భూమిని నిండించింది....(అది 9అద్యా)
అబ్రహముకి ఇవ్వబడిన ఆశీర్వదం ఇస్సాకు, ఇతని ద్వారా సర్వజనములు ఆశీర్వధించబడ్డాయి....(అది 22:18)
యకోబుకు ఇవ్వబడిన ఆశీర్వదం, ఇశ్రాయేలు జనంగానికి కనాను దేశం ఇచ్చింది....(అది 28 అద్యా)
యోసేపుకు ఇవ్వబడిన ఆశీర్వదం, ఇగుప్తును, తన కుటుంబాన్ని కరువు నుండి కాపాడింది....( అది 50:20)
మోషేకి ఇవ్వబడిన ఆశీర్వదం, ఇశ్రాయేలు జనంగానికి విమోచన అందించింది....( నిర్గమా 4:12)
యెహోషువాకు ఇవ్వబడిన ఆశీర్వదం, మోషే లేమిని కొట్టివేసి ఇశ్రాయేలు జనంగానికి దేర్యం ఇచ్చుటకును....(యెహో 1 అద్యా)
గిద్యోనుకు, సంసోనుకి ఇవ్వబడిన ఆశీర్వదం, దేవుని జనంగం పరిరక్షణకు....(న్యాయ 6,7,13 అద్యా)
దావీదు ఇవ్వబడిన ఆశీర్వదం, అవిధేయులకు గుణపాఠం, ఇశ్రాయేలు ప్రజలకు నీతి గల రాజుని ఇచ్చుటకు....(1 సమూ 13:14)
సోలోమోను కు ఇవ్వబడిన ఆశీర్వదం, ప్రజలను న్యాయంగా ఎలుటకును....(1 రాజు 3:7)
నెహేమ్యాకు ఇవ్వబడిన ఆశీర్వదం, పడిపోయిన యెరూషలేము గోడలు కట్టబడుటకును....( నెహే 1 అద్యా)
ఎస్తేరు కు ఇవ్వబడిన ఆశీర్వదం, యూదుల పరిరక్షణకును.... (ఎస్తేరు 4:12-16)
యోబు కు ఇవ్వబడిన ఆశీర్వదం, అనేకులకు బుద్ది చెప్పుటకును, అనేకులను లేవనేత్తుతకును....(యోబు 4:3)
దానియేలుకు ఇవ్వబడిన ఆశీర్వదం, అన్య దేశాలలో దేవుని నామమును ఘనపరచుటకును....(దానియేలు గ్రంధం)
అంతేనా....?
కుమారుడికి ఇవ్వబడిన అభిషేక ఆశీర్వదం, సర్వలోక పాపమును కొట్టివేయుటకును....
పేతురుకు ఇవ్వబడిన ఆశీర్వదం, చెదరగొట్టబడిన ఇశ్రాయేలిలను కట్టుటకును....
పౌలుకు ఇవ్వబడిన ఆశీర్వదం, అన్య జనులను నిలబెట్టుటకును....
ఇప్పుడు సర్వ జలులపై కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ అభిషేకం అనే ఆశీర్వదం, భూదిగంతములవరకు సువార్త ను ప్రకటించుటకును.... (యోవేలు 2:28)(అపో.కా 2:17,18).

నా ప్రియ స్నేహితులారా....
దేవుని అభిషేకం, ఆశీర్వదం ఆ ఒక్క వ్యేక్తి దగ్గరే ఆగిపోవటాన్ని దేవుడు ఎప్పుడు సమర్ధించరు.
తనకి ఇవ్వబడిన ఒక్క తలాంతును ఫలింపనివ్వక పాతిపెట్టిన దాసునికి శిక్ష విదించబడిందన్న విషయం మనం ఎప్పుడు మరచిపోకూడదు. (మత్తయి 25:14-30).

మరి నిజమైన ఆశీర్వదం అంటే....?
"అనేకమందికి ఆశీర్వదకరంగా ఉండటమే నిజమైన ఆశీర్వదం"
దేవుడు ఇస్తే ఇలాంటి ఆశీర్వధాలు మాత్రమే ఎక్కువ ఇస్తారు....

నీకు ఇవ్వబడిన ధనం, జ్ఞానం, వాక్య పరిజ్ఞానం, ప్రార్ధనా శక్తీ, క్రెస్తవ సాక్షం ఏంత మందికి ఆశీర్వదంగా వాడబడుతుంది....? ఇదే ఈ రోజు మీ ప్రశ్న.
మీ యుక్తమైన సమాధానం.... బహుయుక్తమైన ఫలాన్ని ఇస్తుంది.

హల్లెలూయ. . . .

మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో చెప్పబడిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్. 

Comments

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.