అపోస్తలుల బోధ.

💎  అపోస్తలుల బోధ. . . .💎

" ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు."
(హెబ్రీయులకు 9:2-5 )

నిర్గమకాండము 25 నుండి 27 వ అధ్యాయం వరకు అలనాటి ప్రత్యేక్షపుగుడారములోని ముక్య వస్తువులను గురించి ..
వాక్యం ఇలాగు చెబుతుంది.... "ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజరూపము కాదు" అని. అవును.... అలనాడు మందిరములో వాడిన ప్రతి వస్తువుకి ఒక అర్ధం, నిజస్వరూపం ఉంది.
👉 బలిఫిఠము.... పచ్చాత్తపానికి, పాపక్షమాపణకు సాదృశ్యం.
👉 గంగాళము.... మారుమనస్సు, శుధీకరణ, బాప్తిసము, నూతన జన్మకు సాదృశ్యం.
👉 దీపస్తంభము.... సంపుర్ణమైన ఆత్మ నింపుదలకు సాదృశ్యం.
👉 ధూపవేధిక.... యదార్ధమైన ప్రార్ధనకు సాదృశ్యం.
👉 మందసములోని రాతి పలకలు.... తండ్రియైన దేవునికి సాదృశ్యం.
👉 మన్నాగల బంగారు పాత్ర.... కుమారుడైన దేవునికి సాదృశ్యం.
👉 చిగురించిన ఆహారోను కర్ర.... పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం.
👉 కరుణాఫిఠము.... దేవుని సింహాసనానికి, త్రియేక దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యం.

ఇది ఆనాడు దేవుడు ఏర్పరచిన పరిశుద్ధమందిర క్రమము. . . .
మన నేటికాలపు పరిశుద్ధమందిరాలలోకూడా ఇవి అన్ని తప్పక ఉండాలి. . . . అంటే ఈ వస్తువులు ఉండాలి అని కాదు ఈ మందిరపు సాదృశ్యం లక్షణాలు ఉండాలి అని.

మీరు చదువుతూ ఒక విషయాన్నీ గమనించారో లేదో. . . . నేను ఒక వస్తువును దాటవేశాను. . . .
💎 అదే " సన్నిధి రొట్టెల బల్ల ". ఈ రోజు మన ద్యనించే అంశం ఇదే.
" సన్నిధి రొట్టెల బల్ల " దేనికి సాదృశ్యం ?

( నిర్గమ 25:30) లో దేవుడు నిత్యము ఈ సన్నిధి రొట్టెలు ఈ బల్లపై ఉండాలి అని మోషేతో అజ్ఞానాపించాడు.
మిగిలిన అన్ని వస్తువులవాలే ఈ " సన్నిధి రొట్టెల బల్ల " మందిరములో ప్రధానమైన వస్తువు. ఇది మందిరములో తప్పక ఉండాలి అని మోషేతో దేవుడు అజ్ఞాపించారు.
మరి.... ఈ " సన్నిధి రొట్టెల బల్ల " దేనికి సాదృశ్యం ?
గమనించండి.... ఈ సన్నిధి రొట్టెల బల్లపై రెండు వరుసలుగా రొట్టెలు పేర్చి ఉంటాయి. ఒక్కొక వరుసలో 6 రొట్టెల చొప్పున మొత్తము 12 రొట్టెలు ఉంటాయి. ( లేవి 24:6).
ఈ 12 రొట్టెలే ఎందుకు ? యేసు తనే స్వయంగా కొందరిని తన శిష్యులనుగా  12 అపోస్తలులను ఎన్నిక చేసారు ఈ 12 మంది కలసి యేసు ప్రారంభించిన పరిచర్యను కొనసాగించారు, సువార్త ప్రకటించారు, బోధించారు.... వీరి బోధనా సిధంథాన్ని "అపోస్తలుల బోధ" అని పిలుస్తారు.
అవును. . . . ఈ సన్నిధి రొట్టెల బల్ల, దాని మీదవున్న 12 రొట్టెలు.... 12 అపోస్తలుల బోధకి సాదృశ్యం.

ఏంత అద్భుతమో ఒక్కసారి చూడండి....
👉  ఈ సన్నిది రొట్టెల బల్లపై ఉండవలసిన 12 రొట్టెలు ఒకే కొలతలలో ఉండలి అని వ్రాయబడింది. (లేవి 24:5). అలాగే....
👉 ఈ అపోస్తలులు ఉండటానికి 12 మంది ఉన్నా వారి బోధ మాత్రం ఒకే కొలతలో, ఒకేలా ఉంది; అందుకే వారి బోధను విడదీయకుండా కలిపి "అపోస్తలుల బోధ"గా పిలిచారు. ఒకే మాట, ఒకే బోధ.
మన నేటికాలపు పరిశుద్ధమందిరాలలో కూడా ఈ "అపోస్తలుల బోధ" తప్పక ఉండాలి. ఒకే మాట, ఒకే బోధ.
ఈ అపోస్తలుల బోధ ద్వారా కట్టబడ్డయి .

ఈ "అపోస్తలుల బోధ" మనిషిని బట్టి మారిపోదు.
ఈ "అపోస్తలుల బోధ" సంఘాన్ని బట్టి మారిపోదు.
కానీ నేడు సువార్త పరిచర్యలో లక్షలకొద్ది పధతులు, వేలకొద్ది మార్గాలు.
ప్రతి సంఘానిది ఒక్కొక్క బోధ. . .

👉  అపోస్తలుల బోధ ఏది ?
ముందు నాకు అపోస్తలుల బోధ అంటే ఏంటి అనేది తెలిస్తే మిగిలిన దొంగ బోధలకు నేను దూరంగా ఉండగలను.
అపో.కా2:14-40" వరకు ఈ ప్రసంగం చాలా వివరంగా వ్రాయబడింది. ఇక్కడే అపోస్తలుల బోధ దాగివుంది.
👉  అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో ప్రకటింపబడుతుంది. అపో.కా 2:1-3
👉 దేవుని వాక్యం మాత్రమై ప్రకటింపబడుతుంది. అపో.కా 2:16-35
👉 సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధనుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది. అపో.కా 2:22-24

👉 యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది. అపో.కా 2:31-36
👉 యేసే; మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది. అపో.కా 2:22-36
👉 ప్రాముక్యంగా యేసుక్రీస్తే దేవుడని ,ప్రభువని ప్రకటింపబడుతుంది. అపో.కా 2:36
👉 పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది. అపో.కా 2:38
👉 మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది. అపో.కా 2:38
👉 పరిశుద్ధాత్మఅను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది. అపో.కా 2:38
👉 ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది. అపో.కా 2:38-40
👉 ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది. అపో.కా 2:41
ఆమేన్.

Comments

  1. చాల బాగుంది సార్ ఈ పాఠంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే _12అపొస్తులుల గూర్చి పాతనిబంధనలొ చెప్పటం అచర్యానికి గురి చేసింది

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.