యేసుక్రీస్తు రాకడకు నీవు సిద్ధంగావున్నావా?

నిర్లక్ష్యము చేయకండి!!



భయంకరమైన రోజులు  రాబోతున్నాయీ..
కనుక
1.మెలకువగా  వుండి  ప్రార్ధన  చేయండి.


2.పరిశుద్ధంగా జీవించండి.

3. మీ పిల్లలను సిద్ధపరచండి

4. కుటుంబ ప్రార్ధన రోజు  చేసుకోండి.


5. మీ చుట్టూ ఉన్నవారి  గురించి, మీ బందువుల గురించి,
మిత్రుల గురించి  ప్రార్ధన  చేయండి.
ప్రవక్తల గురించి, 
సువార్త చెప్పే వారి గురించి,
దైవజనుల గురించి, 
పరిశుద్ధుల గురించి  
క్రైస్తవుల గురించి, 
యీశ్రాయేలు గురించి  
అందరి గురించి ప్రార్ధన  చేయండి.



6. అందరూ  యేసుక్రీస్తును తెలుసుకోవాలని,యేసుక్రీస్తు ను   అంగీకరించాలని  ప్రార్ధన  చేయండి



7. మన  దేశము కొరకు ప్రార్ధన   చేయండి.ప్రపంచంలో వున్న ప్రతి  యేసుక్రీస్తు బిడ్డల గురించి  ప్రార్ధన చేయండి.


8. అందరూ యేసుక్రీస్తు  రాజ్యంలో ఉండాలని ప్రార్ధన  చేయండి.

9. అందరికి  యేసుక్రీస్తు  గురించి,రాకడ గురించి,తొందరగా తెలియ జేయండి.

10. పాపక్షమాపణ, మారుమనసు  గురించి తెలియజేయండి.

11. మీకు ఎవరైనా శత్రువులు  ఉంటే వెంటనే క్షమించండీ.


12. మీలో వున్నా ప్రతి చిన్న తప్పులను యేసుక్రీస్తు దగ్గర  ఒప్పుకొని పవిత్రులుగా రాకడలో ఎత్తబడే వారిగా  వుండండి.
మీరు,మి కుటుంబాలు  సిద్ధంగా వుండి,అందరిని  సిద్ధపరచండి.


నా గురించి,నా కుటుంబము  గురించి ప్రార్ధన చేయండి.

ఎవరైనా యేసుక్రీస్తు రాకడ  ఇపుడే రాదు అని చెబితే   నమ్మకండి..

సాతానుడు మిమ్ములను  నిర్లక్ష్యము లో పడవేయటానికి  వాడు వేస్తున్న తంత్రములను  గుర్తించండి.

యేసుక్రీస్తు రాకడ విషయములో ఏమాత్రము   నిర్లక్ష్యముగా వుండకండి.

బుద్ధి కలిగిన కన్యకలు వలే  సిద్ధంగా,మేలుకుగా వుండండి.


మహా ఘోరమైనా శ్రమలు రాబోతున్నాయీ..  
ఈ శ్రమలు నుండి  పరిశుద్ధులను తప్పిoచుటకు  యేసుక్రీస్తు మేఘం అనే ఓడతో   రాబోతున్నాడని మర్చిపోకండి.  దేవుడు ఆనాడు నీతిమంతుడైయినా నోవా  ద్వారా ఏవిధంగా ఓడను తాయారు చేసి  తన  కుటుంబాన్ని ఎలా రక్షించాడో...



ఈనాడు నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వార  పరిశుద్ధులందరిని మేఘం  అనే  ఓడలోకి  ఎక్కించబోతున్నాడు...అదే 



 దేవుడు ఆనాడు ఓడను  భూమిపైనే తాయారు  చేయించాడు.
కానీ ఈనాడు పరలోకంలోనే   తయారుచేసి తన  కుమారుడైన యేసుక్రీస్తుతో  పంపుతున్నాడు!!
  
"యేసుక్రీస్తు మెగారుడై వచ్చుచున్నాడు"
కనుక సిద్ధంగా ఉందాం.



పరిశుద్ధాత్ముడు  మీ అందరితో  ఉండి  మీకు  సహాయము  చేయునుగాక !!
ఆమెన్.

Comments

Post a Comment

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.