సృష్టి ఆరంభములోనే యేసు నిర్మించబడ్డాడు “ నేను పుట్టితిని ’’ అని ఆయనే అన్నాడుగా ( సామెతలు 8:22-26),ఆ జ్ఞానమే క్రీస్తు అని పౌలు చెప్పాడు ( 1 కొరింథీ 1:24), ఇది వాస్తవమేనా ?

సృష్టిఆరంభములోనే యేసు నిర్మించబడ్డాడు “ నేను పుట్టితిని ’’ అని ఆయనే అన్నాడుగా ( సామెతలు  8:22-26),ఆ జ్ఞానమే  క్రీస్తు అని పౌలు చెప్పాడు ( 1 కొరింథీ 1:24), ఇది వాస్తవమేనా ?


జవాబు :  దీనికి జవాబు మనం కనుగొనాలంటే  కేవలం తెలుగు బైబిలునో  లేదా ఇంగ్లీషు బైబిలునో చదివితేనే మనకు అర్థంకాదు,కొంచెం శ్రమించి Hermeneutical Scale ని  ఉపయోగించిTextual Surveyదిశగా అన్వేషించాలి,అప్పుడే మనం దీనికి జవాబును పొందగలం.
హెబ్రీ మరియు గ్రీకు భాషలో ఉన్న లేఖనాలను మనం పరిశీలిస్తే సామెతలలో వున్న జ్ఞానము మరియు కొరింథీయులలో చెప్పబడిన జ్ఞానము  యేసే అని అర్థాన్ని ఇవ్వదు. సామెతలలో ఉన్న జ్ఞానానికి ( חכמה = Hokmah) అనే హెబ్రీ పదాన్ని వాడారు ఈ హోక్మా అనే పదం స్త్రీకి ఉపయోగించే పదం. అందుకే  KJV English Bible  లో కూడా  She  అనే తర్జుమా చేసారు తప్ప He అని కాదు.  ఇదే జ్ఞానమును గూర్చి వ్రాస్తూ సామెతలు 7:4 లో  “జ్ఞానము” ను అక్క అని పిలవాలి’’ అని  వ్రాయబడిఉంది. ఒకవేళ  సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానము యేసే అని మనం భావించినట్లయితే  మరి యేసుని అక్క అని పిలుద్దామా ?
భక్తుడైన సొలొమోను మహాగొప్ప వివేకి కనుక  జ్ఞానమును గూర్చి తనదైన శైలిలో అలంకార ప్రాయంగా వ్రాసాడు అంతవరకే మనం తీసుకోవాలి. ఇక  కొరింథీలో వున్న జ్ఞానము విషయానికి వస్తే గ్రీకులో  (Σοφια = Sophian ) సోఫియాన్ అనే పదం వాడబడినది. పౌలు దీనిని ఉపయోగించడానికి గల కారణం ఏమిటంటే, నాటి కాలంనాటి గ్రీకులు ప్రపంచమంతా తిరిగి కొంగ్రొత్త విషయాలు తెలుదుకోవడానికి ఉవ్విళ్ళూరేవారు,జ్ఞానమును తెలుసుకోవడమే ప్రాతిపదికగా వారు పెట్టుకున్న దరిమిలా  " లోకజ్ఞానము మీకెంత దొరికినా క్రీస్తు అనే జ్ఞానమును మీరు తెలుసుకోకపోతే జీవితమే వ్యర్థం " అనే భావంలో పౌలు మాట్లాడాడే కానీ సామెతలలో ఉన్న జ్ఞానము క్రీస్తే అనే భావంలో అసలు చెప్పనేలేదు.
కనుక సామెతల గ్రంథంలో వున్న జ్ఞానానికి కొరింథీపత్రికలో వాడబడిన జ్ఞానానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. ఎవరో ఏదో కూసారుకదా అని లోపభూయిష్టమైన పలుకులకు మనం కూడా వల్లించేస్తే దిద్దుకోలేని పొరపాటు చేసినవారమౌతాము.

Comments

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.